»Uttar Pradesh College Principal Supports To 10 Children Women Second Marriage In Gorakhpur District
10 Children ఉన్న తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కళాశాల ప్రిన్సిపల్ పెద్ద మనసు
గ్రామాన్ని వదిలేసి పారిపోయారు. అయితే ఆమె తన పిల్లల గురించి పట్టించుకోలేదు. బంధువుల వద్ద ఉన్న పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. పిల్లల భవిష్యత్ కోసం ఆమెను తిరిగి పెళ్లి చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ ప్రతిపాదించాడు. చెప్పినట్టుగానే అతడి ప్రియుడితో ఆమెతో వివాహం జరిపించారు.
పది మంది పిల్లలు (Children) ఉన్నారు. భర్త చనిపోయాడు. కాగా ఆమె బతుకు భారమైంది. ఈ సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో (Love) పడింది. వారిద్దరూ కలిసి గ్రామాన్ని వదిలేసి పారిపోయారు. అయితే ఆమె తన పిల్లల గురించి పట్టించుకోలేదు. బంధువుల వద్ద ఉన్న పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. పిల్లల భవిష్యత్ కోసం ఆమెను తిరిగి పెళ్లి చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ (Principal) ప్రతిపాదించాడు. చెప్పినట్టుగానే అతడి ప్రియుడితో ఆమెతో వివాహం జరిపించారు. అంతటితో ఆగకుండా వాళ్లు ఉండేందుకు వసతితో పాటు ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తామని ప్రిన్సిపల్ ప్రకటించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో జరిగింది.
గోరఖ్ పూర్ (Gorakhpur District) జిల్లా బహల్ గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ (42) భర్త ఆరేండ్ల కిందట మృతి చెందాడు. అయితే అప్పటికే వారికి 10 మంది పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన కొన్నాళ్లకు అదే గ్రామానికి చెందిన బాలేంద్ర (40)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. గతేడాది బాలేంద్రతో సోనీ శర్మ గ్రామాన్ని వదిలేసి పారిపోయింది. పిల్లలను చూసేందుకు అప్పడప్పుడు పిల్లలను చూసేందుకు సోనీ శర్మ గ్రామానికి వచ్చి వెళ్లేది. అయితే పిల్లలు ఇబ్బందులు పడుతుండడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని గ్రామానికి చెందిన ఓ పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ (Jai Prakash Shahi) నిర్ణయించాడు. వారిద్దరినీ గ్రామానికి పిలిపించి పెళ్లికి ఒప్పించారు.
అనంతరం గ్రామంలోని ఓ ఆలయం (Temple) వద్ద సోనీ శర్మ, బాలేంద్ర పెళ్లి సాదాసీదాగా నిర్వహించారు. పెళ్లి (Marriage) జరిపించడమే కాక సోనీ శర్మ సంసారం కోసం ప్రిన్సిపల్ చేదోడు అందించారు. పది మంది పిల్లలతో కలిసి ఆ దంపతులు ఉండేందుకు వసతి సౌకర్యం కల్పించారు. దీంతోపాటు బాలేంద్ర, సోనీ శర్మకు తన కళాశాలలో ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల కోసం ఆ ప్రిన్సిపల్ తీసుకున్న చొరవపై గ్రామస్తులు అభినందిస్తున్నారు.