»Ysrcp Goons Attack On Tdp Karyakarta House In Kuppam
Kuppamలో ఉద్రిక్తత.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి
దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ అరాచకం చేస్తోంది. మరోసారి కుప్పంలో (Kuppam) వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నివాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో రెండు రోజులుగా కుప్పంలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో టీడీపీ (Telugu Desam Party) నాయకుడు జగన్ (Jagan) ఇంటిపై గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. దాదాపు 50 మందికి పైగా దాడులకు తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి సామాన్లు చిందరవందర చేశారు. వారి దాడిలో జగన్ గాయపడ్డాడు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. గాయపడిన కార్యకర్తను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (Kancharla Srikanth) పరామర్శించారు. అయితే ఎమ్మెల్సీ రాకను గమనించిన వైసీపీ దుండగులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలో రెండు సార్లు కార్యకర్త జగన్ ఇంటిపై దాడి (Attack) చేశారు. దీంతో కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
శుక్రవారం తెల్లవారుజామున టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తపై దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై (TDP Karyakarta) విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు. రోడ్లపై బైక్ లు దహనం చేశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.