»Tamil Nadu Cm Stalin Son Udhayanidhi Stalin Controversial Comments On Sanatana Dharma
Udhayanidhi stalin: సనాతన ధర్మంపై సీఎం కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin) శనివారం సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. అతను చేసిన వ్యాఖ్యలకు అనేక మంది నేతలను ఉదయనిధిని విమర్శిస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉండి అలా ఎలా మాట్లాడతారని అంటున్నారు.
tamil nadu CM stalin son udhayanidhi stalin controversial comments on Sanatana Dharma
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin) సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోల్చారు. దాన్ని పూర్తిగా చెరిపివేయాలని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ శనివారం చెన్నైలో ఒక సదస్సును నిర్వహించింది. దీనికి సనాతన నిర్మూలన సదస్సు అని పేరు పెట్టారు. ఈ సమావేశంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి నిర్వహించిన ఈ సదస్సులో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు అని కూడా తెలిపారు. మనం తొలగించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మనం ప్రతిఘటించలేము. దోమలు, డెంగ్యూ, కరోనా, మలేరియా వంటివి మనం నిరోధించలేనివి. వాటిని మనం తొలగించాలని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి సనాతనం మన మొదటి పని కాదని, దానిని వ్యతిరేకించాలని అన్నారు.
Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo
ఉదయనిధి వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున అతన్ని విమర్శిస్తున్నారు. ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలా సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు నేతలు అంటున్నారు. దీంతోపాటు అక్కడి బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా అతని వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు ఉదయనిధిపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్, మీ తండ్రి మీ సిద్ధాంతకర్తలు క్రైస్తవ మిషనరీల నుంచి ఆలోచనలను కొనుగోలు చేశారని ఆరోపించారు. మిషనరీల ఆలోచనలు మీలాంటి మూర్ఖులకు వారి దురుద్దేశపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. దీంతోపాటు అతని వ్యాఖ్యలను అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ లీడర్ రాజాసింగ్ కూడా దీనిపై స్పందించారు.
తన ప్రకటనను పునరుద్ఘాటిస్తూ కోవిడ్ -19, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసినట్లే.. సనాతన ధర్మం అనేక సామాజిక దురాచారాలకు కారణమైందని ఉదయనిధి స్టాలిన్ మళ్లీ క్లారిటీ(clarity) ఇచ్చారు. న్యాయస్థానంలో తనకు ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేయోద్దని కోరారు.