లియో(leo) సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి..ఇది LCUనా? కాదా? అనే డౌట్స్‌తో విజయ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే మాస్టర్ సినిమా స్టాండ్ ఎలోన్‌గా వచ్చి ఫ్లాప్ అయింది. అందుకే లియో పరిస్థితేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
LCU.. ఈ మాట వింటే చాలు మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు వస్తాయి. LCU అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. ఖైదీ సినిమా నుంచి తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలు LCUలో భాగంగానే వచ్చాయి. విక్రమ్ సినిమాలో రోలెక్స్‌ను కూడా LCUలో భాగం చేశాడు. త్వరలోనే సూర్యతో రోలెక్స్ క్యారెక్టర్‌ను పెట్టి ఫుల్ మూవీ చేయబోతున్నాడు లోకేష్. కానీ లేటెస్ట్ ఫిల్మ్ ‘లియో’ మాత్రం LCUలో భాగం కాదని.. ఇది లోకీ స్టాండ్ ఎలోన్ ప్రాజెక్ట్ అనే టాక్ నడుస్తోంది. ట్రైలర్ కూడా ఇదే చెబుతోంది. దీంతో మాస్టర్ లాగే లియో కూడా లోకి యూనివర్స్‌కు దూరంగా వస్తుందని ఫిక్స్ అయిపోయారు.
కానీ లేటెస్ట్ రివ్యూ మాత్రం లియో(LEO) సినిమా LCUలో భాగంగానే వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాను.. రిలీజ్‌కు ముందే కోలీవుడ్ సినిమా ప్రముఖులు, ఎగ్జిబిటర్ల కోసం స్పెషల్ ప్రివ్యూస్ వేశారు. ఈ సినిమాను మినిస్టర్ ఉధయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కూడా వీక్షించారు. దీంతో.. లియో సినిమా సూపర్, దళపతి విజయ్ యాక్టింగ్ ఇరగదీశాడని ఉదయనిధి స్టాలిన్ ట్వీ ట్ చేశాడు.
లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుతమని..అనిరుధ్ మ్యూజిక్, అన్భుఅరివు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయని అన్నాడు. అలాగే..లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారని.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనని కోలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయ్యిపోయాయి. అందుకే.. లియో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.