శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన రాకెట్(Rocket) విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సి-55 (PSLV C55) రాకెట్ నింగిలోకి సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లింది. క్షణాల్లో రోదసిలోకి రాకెట్ విజయవంతంగా వెళ్లడంతో పరిశోధకులు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 22 గంటల కౌంట్‌డౌన్ తర్వాత పీఎస్ఎల్వీ వెళ్లింది. ఈ రాకెట్ సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెలియోస్-2, 16 కిలోల లూమ్ లైట్-4 ఉపగ్రహాల(Satellite)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
టెలియోస్-2 ఉపగ్రహం(Satellite) సింగపూర్ ప్రభుత్వానికి చెందింది. దీనిని కొన్ని ఏజెన్సీల అవసరాలకు ఉపయోగించనున్నారు. లూమ్ లైట్-4 ఉపగ్రహాన్ని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసింది. దీని వల్ల ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం కలగనుంది.
పీఎస్ఎల్వీ సీ-55 (PSLV C55) రాకెట్(Rocket) ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో(ISRO) ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రయాన్ -3, మిషన్ ఆదిత్య వంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఇస్రో నుంచి మరో రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో(ISRO) మరో రికార్డును నెలకొల్పింది.