Earth day 2023: నేడు ప్రపంచ ఎర్త్ డే..మరి నేలను కాపాడుకుంటున్నామా?
గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ఎర్త్ డే(world earth day 2023)గా జరుపుకుంటారు. పర్యావరణానికి హాని కలిగించే మన భూ గ్రహం మనుగడకు ముప్పు కలిగించే కాలుష్య స్థాయిలు, వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితులపై అవగాహన పెంచడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 2023 ఎర్త్ డే థీమ్ “మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి” గ్రహం కోసం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రజలు, వ్యాపార వ్యవస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇది జరగాలంటే వ్యాపారాలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక మార్కెట్లు గ్రీన్ ఇన్నోవేషన్ సహా అనేక అంశాలను ప్రోత్సహించాలి. తద్వారా ప్రైవేట్ రంగం గణనీయమైన మార్పులను తీసుకురావడం ద్వారా అద్భుతమైన మార్పులను చూసే అవకాశం ఉంది. దీంతోపాటు మంచి భూ వ్యవస్థ కోసం పౌరులు ఇతర సంస్థలను ప్రోత్సహించడంతోపాటు ఆయా ప్రభుత్వాలు కూడా తమ వంతు కృషి చేయాలి.
మొదటి ఎర్త్ డేని 50 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 22, 1970న జరుపుకున్నారు. మొదటి ఎర్త్ డేని నిర్వహించిన వ్యక్తి డెనిస్ హేస్. 60వ దశకం చివరిలో అనేక పర్యావరణ సమస్యలు బహిరంగ చర్చకు వచ్చాయి. రాచెల్ కార్సన్ 1962లో సైలెంట్ స్ప్రింగ్ అనే తన ప్రాథమిక పుస్తకాన్ని ప్రచురించింది. దీనిని పర్యావరణంపై యుద్ధంలో భాగంగా మొదటి షాట్”గా భావించవచ్చు.
కొంతకాలం తర్వాత 1969లో శాంటా బార్బరా చమురు పర్యావరణ విధ్వంసం, బెంగళూరులోని బెల్లందూర్ సరస్సులో మంటలు ఇలా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు పైప్ ఉద్గారాల వల్ల తమ పొరుగు ప్రాంతాలు కలుషితమవుతున్నాయని ఆయా ప్రాంతాల వారు ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా చుశాం. ఈ క్రమంలో 1969 యునెస్కో సమావేశంలో శాంతి కార్యకర్త జాన్ మెక్కానెల్ భూమి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజును ప్రతిపాదించారు.