bungalow vacate : సర్కారు బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. సూరత్ కోర్టు(Court of Surat) ఈ కేసు విచారణ జరిపి.. ఇటీవల రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళ్లేందుకు ఒక నెల గడువు ఇచ్చింది. శిక్ష పడటంతో లోక్‌సభ (Lok Sabha)సెక్రెటేరియట్ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసింది.
ప్రధాని మోదీ (PM MODI) ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో దోషిగా తేలి, (Parliament) సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు తన అధికారిక బంగళా ఖాళీ చేశారు. ఢిల్లీ (Delhi) లోని తుగ్లక్ లేన్లోగల 12వ నెంబర్ బంగళాలోని ఆయన వస్తువులను తీసుకుని ఓ ట్రక్ వెళ్లిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2004లో లోక్ సభ (Lok Sabha) సభ్యుడిగా గెలుపొందిన రాహుల్ గాంధీకి ఈ బంగళా కేటాయించారు. నాటి నుంచి ఈ భవంతి రాహుల్ అధికారిక నివాసంగా మారింది. అయితే..మోదీ పేరుపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్టు 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇటీవలే ఆయనను దోషిగా తేల్చింది. ఇప్పుడు ఎంపీ పదవిని కోల్పోవడంతో బంగ్లా(Bungalow)ను ఖాళీ చేయాలని ఆదేశించింది.
దాంతో ఆయన ఇవాళ తన బంగ్లా నుంచి సామాగ్రిని తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో నిబంధనలను అనుసరించి రాహుల్ మార్చి 23 నుంచి ఆటోమేటిక్‌గా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినట్టు లోక్‌సభ సెక్రెటరీ ఓ ప్రకటన జారీ చేశారు. ఆ తరువాత ఎంపీ(MP)గా ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 22 లోపల ఖాళీ చేయాలంటూ డెడ్ లైన్ (Dead line) విధించారు. ఈ క్రమంలోనే రాహుల్ తన బంగళా ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.12 తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక బంగ్లా నుంచి 10 జనపథ్ రోడ్డులో ఉన్న ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాసానికి డీసీఎం వ్యాన్ల ద్వారా సామాగ్రిని తరలించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీ ట్విటర్లో పోస్టు చేసింది.
#WATCH | Trucks from Congress leader Rahul Gandhi's 12 Tughlak Lane bungalow leave for his mother and UPA chairperson, MP Sonia Gandhi's residence at 10 Janpath.