»I Cant Cut My Throat By Joining That Party Former Mp Ponguleti
Khammam : ఆ పార్టీలో చేరి గొంతు కోసుకోలేను ..మాజీ ఎంపీ పొంగులేటి
తాను వైఎస్సార్ తెలంగాణగా పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు పొంగులేటి. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరకపోడవంపై షర్మిల కోపంగా ఉందని.. మొహమాటానికి చేరి తన గొంతు తానే కోసుకోలేనని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి (Ponguleti) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వైఎస్ఆర్టీపీ (YSRTP) పార్టీలో చేరి తన గొంతు కోసుకోలేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Ponguleti Srinivas Reddy) అన్నారు. షర్మిల కోపంతో ఉందని నేను ఆ పార్టీలో జాయిన్ కాలేనని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ లక్ష్యంతో బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం కలిగిన పార్టీలోనే చేరుతానని ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) రాజకీయాలపై పట్టు ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ (BRS) తో బంధం తెగిపోయింది. దీంతో ఆయన దారెటు అనేదానిపై రోజుకో ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని, సందర్భం చూసి కండువా కప్పుకోవడమే ఆలస్యం అని కొంతమంది ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ (Congress)సైతం ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పై అసమ్మతి రాగం వినిపిస్తున్న పొంగులేటిని ఇక సహించేది లేదని ఇటీవలే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే గతంలో సీఎం కేసీఆర్ (CMKCR)తో పాటు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న పొంగులేటి భవిష్యత్ లో కేసీఆర్ కు తనంటే ఏంటో చూపించబోతున్నారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ (YSRCP) తరపున లోక్ సభకు ఎన్నికైన పొంగులేటి అనంతరం జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గానీ 2019లో జరిగిన (Lok Sabha) ఎన్నికల్లో గాని ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంగతిని పొంగులేటి తాజాగా వివరించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు తిరిగి పార్టీ టికెట్ వస్తుందని భావించిన పొంగులేటికి కేసీఆర్ మొండిచేయి చూపించారు. అయితే 2019లో లోక్ సభ టికెట్ తనకు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ (CM Jagan) కేసీఆర్ ను కోరినా దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. తనను కాదని ఇతరులకు టికెట్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తాను చెప్పినా కేసీఆర్ వినకపోవడంతో అది జగన్ మనసులో ఉండి ఉంటుందేమో అని పొంగులేటి తెలిపారు. కేసీఆర్ తడిబట్టతో తన గొంతు కోశారని ఈ బాధ అనుభవించినోడికే తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) నేతల అవినీతి పెద్ద ఎత్తున ఉందని సందర్భం వచ్చినప్పుడు ఆ అవినీతి ఎలా ఉంటుందో తప్పకుండా వివరిస్తానన్నారు.కేసీఆర్ ఎదుట లేని గౌరవం నటించడం తన వల్ల కాదని, పార్టీ నుంచి సస్పెండ్ తో దొరల గడి నుంచి విముక్తి లభించినట్లుగా ఉందన్నారు. రావణాసురుడి కబంధ హస్తం నుంచి భద్రాద్రి రాముడి పాదాల వద్దకు చేరుకున్నట్లుగా అనుభూతి కలుగుతుందన్నారు.