»Prime Minister Modi Praised Union Minister Kishan Reddy
Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మెచ్చుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై (Kishan Reddy) ప్రశంసలు కురిపించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం సికింద్రాబాద్ నియోకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ (Healthy Baby Show') అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ( PMModi) అభినందించారు. ఇది చిన్నారులకు ఎంతో మేలు చూస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై (Kishan Reddy) ప్రశంసలు కురిపించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం సికింద్రాబాద్ నియోకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ (Healthy Baby Show’) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ( PMModi) అభినందించారు. ఇది చిన్నారులకు ఎంతో మేలు చూస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న మోదీ.. ‘ఇది అద్భుతమైన ప్రయత్నం. చిన్నారులకు ఎంతో మేలు చేస్తుంది’ అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం గురించి కిషన్ రెడ్డి వివరిస్తూ.. సికింద్రాబాద్ (Secunderabad) పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి హౌజింగ్ సొసైటీ లోనూ ‘హెల్తీ బేబీ షో’కు సంబంధించిన దరఖాస్తు ఫామ్ లను పంచినట్టు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు సన్మానం చేయడంతోపాటు వారికి సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అలాగే వారికి ‘పోషణ్ కిట్లు’ (‘Potion Kits’)ఇచ్చి చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలిస్తామంటూ వారితో ప్రతిజ్ఞ చేయించామన్నారు. వారి ఇచ్చిన కిట్లలో ప్రొటీన్ పౌడర్, ప్రొటీన్ బిస్కట్లు, నెయ్యి, ఖర్జూరాలతోపాట డైపర్లు, ఫొటో ఫ్రేమ్, బొమ్మ కూడా ఉన్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.