త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేం...
బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఆయన చెప...
ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అధికార, రాజకీయ, కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. పర్యటన ఇప్పుడు వాయిదా పడిందని.. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన ఏర్పాట్లలో ఇప్పటికే బీజేపీ నేతలు నిమగ్నం అయ్యారు. హైదరాబాద...
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. నలుగురు కలిస్తే వర్గం, టీపీసీసీ చీఫ్‌కు సీఎల్పీ నేతకు పడదు, సీనియర్లకు జూనియర్ల మధ్య పొసగదు. అందుకోసమే ఆ పార్టీ ఇంచార్జీలను వెంట వెంటనే మార్చాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. సీనియర్లు ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. దీంతో హై కమాండ్ వెంటనే అతనిని పదవీ నుంచి త...
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్ పదవీని తోట చంద్రశేఖర్ అప్పగించారు. మరీ తెలంగాణ శాఖను ఎవరికీ ఇస్తారు అనే చర్చ వచ్చింది. ఇప్పటికే విపక్షాలు కూడా సెటైరికల్‌గా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ శాఖకు...
దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...
త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ కంటే జేడీఎస్‌కు ఎంతో కీలకం. మొదటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీలు ఓడినా, గెలిచినా ప్రభావం తక్కువే! జేడీఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సినవే. 1999లో పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన మెజార్టీని దక్కించుకోలేదు. పార్టీ అధినేతలు దేవేగౌడ, కుమారస్వామి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చున్నప్పటికీ, తమ కంటే ఎక్కు...
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్‌కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్‌తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటిక...
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరగడంతో… ఈ ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజుకు సభ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రిసైడింగ్ ఆఫీసర్, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు. ఈ ఎన్నికను ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్న ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు పెద్దఎత్తున రభస సృష్టించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియన...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థులకు శుభవార్త తెలియజేసింది. మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు ప్రతిరోజూ చికెన్, ఎగ్స్ అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేయడం విశేషం. వాటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ అందించేందుకు సమాయాత్తం అయింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ వడ్డించే అన్నం, పప్పు, కూరగాయలతో పాటు చికెన్, ఎగ్స్ కూడా విద్యార్ధుల భోజనంలో జత చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా? తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా? ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా? మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా? కోర్టులో వరుస షాక్‌లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇ...