బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్‌కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్‌తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటికి పూర్తి కావాలి. ఇలాంటి సమయంలో ఫోకల్ డేటా నిర్వహించిన సర్వేలో పలువురు మళ్లీ గెలిచే అవకాశాలు లేవు.
ఈ సర్వే ప్రకారం రిషి సునక్, డొమినిక్ రాబ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి స్టీవ్ బార్క్లే, ఫారెన్ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలేస్, బిజినెస్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్, కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ థెరిస్సా కొప్పిల పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేవలం ఐదుగురు కేబినెట్ మెంబర్స్ జెరెమీ హంట్, బ్రేవర్మాన్, మైఖేల్ గోవ్, నదీమ్ జవావీ, కేమీ బడెనోక్ మాత్రమే 2024 తర్వాత జరిగే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయట. పది ముఖ్యమైన స్థానాల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశముందని వెల్లడించింది.