సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్‌గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అ...
జగన్‌ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నార...
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస...
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. దేశాన్ని కుదిపేసింది. అంజలి అనే యువతి స్కూటీ మీద వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొట్టి దాదాపు 12 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన అంజలి కన్నుమూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం పరిధి రోహిణి జిల్లా పోలీసు స్టేషన్ కిందికి వస్తుంది. ఘటన […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్య...
రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రివర్స్ అయ్యాయి. పవన్ ప్రతి అంశాన్ని సూటిగా మాట్లాడుతారని జనసైనికులు చెప్పవచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని చెల్లుబాటు కావు. చిన్న తడబాటును కూడా విపక్షాలు అనుకూలంగా ...
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ కోసం ఏకంగా 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించింది. అన్నామలై భద్రత కోసం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. థ్రెట్ ఉండటంతో ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. హిట్ లిస్టులో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని అంబటి రాంబాబు శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను సింగిల్‌గా వెళ్తే రాజకీయంగా వీరమరణమని తనకు కూడా అర్థమైందన్నారు. పోరాడే దమ్ములేక, విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే దానిని భరించలేక ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటన్నారు. అసలు పవన్ చేసిన పోరాటం ఏమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద కూడా పోరాటం చేశానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్న...
ప్రముఖ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ అనారోగ్యంతో గుర్గావ్‌లో ఫోర్టిస్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శరద్ యాదవ్ నిన్న (గురువారం) రాత్రి కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శరద్ యాదవ్ సోషలిస్ట్ నేత.. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కి ప్రియ శిష్యుడు. జేపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేయగా.. శరద్ యాదవ్ గురువు వెంటే ఉన్నారు. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి....
పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకోవాలని, డబ్బుల కోసం జగన్‌పై, వైసీపీ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడుతావా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనను, అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ఎలా అని, వారి కులం కాబట్టి మాపై ఆయనకు హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతారా అని నిలదీశారు. తన పేరు తెలియనట్లుగా మంత్రి అంటూ మాట్లాడుత...
ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...
అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింద...