భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్ పదవీని తోట చంద్రశేఖర్ అప్పగించారు. మరీ తెలంగాణ శాఖను ఎవరికీ ఇస్తారు అనే చర్చ వచ్చింది. ఇప్పటికే విపక్షాలు కూడా సెటైరికల్‌గా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ శాఖకు అభ్యర్థిని ఖరారు చేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండెట్ ఎంపిక చేశారు. ప్రకటించడమే మిగిలిపోయింది. సంక్రాంతి పండగ తర్వాత అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
రాష్ట్రానికి చెందిన బండ ప్రకాశ్‌కు పదవీ ఇస్తారని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ఇదివరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో చాలా మంది నేతలు ఉన్నారు. కేసీఆర్ నమ్మిన వారు చాలా మందే ఉన్నారు. ఏ సామాజిక వర్గంలో అయినా సరే కనిపిస్తారు. కానీ బండ ప్రకాశ్ ఎంపికలో గులాబీ దళపతి పెద్ద స్కెచే వేశారు. అవును.. బండ ప్రకాశ్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో ఈ క్యాష్ట్ ఓట్లు కాస్త ఎక్కువే. వారందరినీ ఆకర్షించేందుకే ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీంతోపాటు మరో కారణం కూడా ఉంది. కొద్దీ రోజుల క్రితం బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారే. అతను బీజేపీలో ఉండగా.. వారి ఓట్లు అన్నీ కమలానికి పడతాయని అనుకున్నారు. దీంతో ఆ కులం ఓట్లను మళ్లించుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడగా ఇదీ భావించవచ్చు.
ఓటు బ్యాంకును ఆకర్షించడమే పార్టీల పని. రాష్ట్రంలో ఎన్నికకు ఏడాది కూడా సమయం లేదు. బీజేపీ కూడా ముదిరాజ్‌లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ముదిరాజ్ కుల పెద్దలను కలిశారు. దీంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఆ కులానికి చెందిన మొత్తం ఓట్లు వన్ సైడ్ వెళ్లకుండా ట్రై చేశారు. అందుకోసమే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవీని ప్రకాశ్‌కు అప్పగించబోతున్నారు. దీంతో జాతీయ పార్టీలో తమ నేతకు కీలక పదవీ వరించిందని ఆ సామాజిక వర్గానికి చెందినవారు అనుకుంటారని అంచనా వేశారు. దీంతో తమకు మేలు జరుగుతుందని, ఓటు బ్యాంక్ తిరిగి వస్తోందని దళపతి ఆలోచన. అందుకోసమే కీలక పదవీని ఇవ్వబోతున్నారు.
నిజానికి బండ ప్రకాశ్ అంత మాస్ లీడరేం కాదు. రాజ్యసభకు ఎన్నికై, మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు ఎప్పుడూ రాలేదు. జనానికి అంతగా తెలియదు. పేరున్న నేత ఏం కాదు. కానీ తమ పార్టీకి ఓ బలమైన సామాజిక వర్గం ఓట్లు రావాలంటే తప్పదని కేసీఆర్ డిసైడయ్యారు. అందుకోసమే బండ ప్రకాశ్‌కు పదవీని అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో బీసీలకు పెద్దపీట వేశామనే అభిప్రాయం జనాల్లోకి తీసుకెళతారు. ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా వారికే రానున్నాయి. ఇదీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తోందని కేసీఆర్ లెక్కలు వేశారు. మరీ దీనికి కౌంటర్‌గా బీజేపీ ఏం చేయనుందో చూడాలీ మరీ.