స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...
బడ్జెట్ సమావేశాలకు సమయం సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది (2023) ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తమపై కరుణ చూపిస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కిల్లీ కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ దాకా కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటాయి. అయితే బీజేపీ సారథ్యంల...
త్వరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రజలను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ గృహలక్ష్మి అనే పథకం ప్రకటించింది. దీనికి పోటీగా తాజాగా కర్ణాటక మంత్రి ఆర్.అశోక ప్రతి పేద కుటుంబాన...
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ ను తెరిచినట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ 10న జరిగన ఈ సంఘటన దుమారం రేపుతోంది. చెన్నై నుండి తిరుచ్చిరాపల్లి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై కూడా ఉన్నారు. ఓ ప్రయాణీకుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను పొరపాటున తెరిచారని ఇండిగో మంగళవారం తన ప్రకటనలో తెలిపింది. అయితే ఆ ప్రయాణీకుడు తేజస్వి సూర్య అని కాంగ్రెస్ వెల...
యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి బిహార్ కు చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఏకంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు...
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకు...
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు గూఢచర్యం సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. అతనిని అరెస్ట్ చేసింది. నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. అతను కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వారు ఆయనని పప్పు అంటారు. కానీ… అది తప్పు అని రఘురామ్ రాజన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’అని చెప్పారు. ఆయనతో సంభాషిస్తే...
ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...
గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా.. నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బా...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్ది గంటల్లోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌ను దాటి హిమాచల్ ప్రదేశ్‌లోకి చేరుకున్న మరుసటి రోజే ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో, ప్రభుత్వంలో తనకు అప్ప...
తమిళనాడులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్‌గా మందేసి రోడ్డుమీదకి రచ్చచేసింది. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రంకెన్ టెస్ట్ చేయనీవ్వకుండా హంగామా క్రియేట్ చేసింది. చెన్నైకి చెందిన మీనా స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఫుల్లుగా మందు తాగి, పార్టీ అయిపోయిన తర్వాత స్కూటీ మీద ఇంటికి బయలు దేరింది. సైదాపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది. స్కూటీ తాళం చెవి ...
కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించ...