స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది.
టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్యాంక్ 0.47%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.44% లాభాలను చవిచూశాయి. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ 2.6 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.89 శాతం, టాటా మోటార్స్ 1.87 శాతం, కోటక్ బ్యాంక్ 1.73 శాతం, టైటాన్ 1.59 శాతం నష్టపోయాయి.