కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వారు ఆయనని పప్పు అంటారు. కానీ… అది తప్పు అని రఘురామ్ రాజన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’అని చెప్పారు. ఆయనతో సంభాషిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది అతను ఓ మేధావి అని.
ప్రస్తుత రాజకీయ నాయకులు.. ఆయన్ని విమర్శిస్తుంటే బాధగా అనిపిస్తుందన్నారాయన. నేనురాహుల్ తో అనేక రంగాల గురించి సంభాషిస్తూ దాదాపు ఒక దశాబ్దం పాటు గడిపాను. అతను చాలా తెలివైనవాడు. యువకుడు, ఉత్సాహం ఉన్న వ్యక్తి అని రఘురామ్ రాజన్ కితాబిచ్చారు. భారత్ జోడో యాత్రలో చేపట్టిన తర్వాత ఎంతోమంది ఆయనతో సంబాషించారన్నారు. వారందరికీ అర్ధమయ్యే ఉంటుంది. దేశంలోని గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని. ప్రస్తుతం దేశం అభివృద్ధికి అవసరమైన సంస్కరణలను రూపొందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించానని అన్నారు. తాను నమ్మే విలువలను పాటిస్తున్నందున భారత్ జోడో యాత్రలో పాల్గొన్నానని.. అందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు.