విమాన ప్రయాణమంటే చిరాకు తెప్పించేలా ప్రయాణికుల వ్యవహారం కొనసాగుతోంది. మొన్న విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. ఈసారి ఢిల్లీ- హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో రచ్చ జరిగింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన వారిని కిందకు దించేసి విమానం యథావిధిగా బయల్దేరింది. ఈ సంఘటన జరిగిన రోజే...
అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలుగాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రకటించారు. 80 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు విరమించుకుని మిగిలిన శేషజీవితంలో రాయడం, చదవడం వంటి పనులతో కాలక్షేపం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించి సంచలనం రేపారు. ఈ విషయమై ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం భగత్ సింగ్ కోశ్...
– ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని షాహీద్ మినార్ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. నేతాజీ తన జీవితాన్నంతా దేశం కోసం అంకితం చేశారని కొ...
సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్ల రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టెయిల్స్ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నారా ?’ అని యాంకర్ అడిగ్గా…సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని చెప్పారు. చెక్ లిస్టు ఏమైనా ఉందా?’ అని యాంకర్ ప్రశ్నించగా… ‘అదేమీ లేదు… ప్రేమించే వ్యక్తి, ఇంటెలిజెంట...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర జమ్మూ కశ్మీర్ లో సాగుతోంది. కాగా… ఈ నెలాఖరుకి ఆయన యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆయన యాత్రకు నేతలు, ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఇక, రాహుల్ గాంధీ యాత్రకు అనుభవాలకు సంబంధించి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను ఆ ఇం...
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేకమైన వీడయోను కూడా మోడీ విడుదల చేశారు. వీడియోలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ తనకు మార్గదర్శకుడని, యువతకు ఆయన మార్గనిర్దేశకుడని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన రోల్ మోడల్ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. On Parakram Diwas: A karmayogi's lifelong devotion to the val...
గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...
తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...
భారత అగ్రశ్రేణి ఆటగాడు కేఎల్ రాహుల్ సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ప్రేయసి మెడలో ముచ్చటగా మూడు ముళ్లు వేయనున్నాడు. వీరి వివాహానికి మహారాష్ట్రలోని ఖండాలలో ఉన్న తనకు కాబోయే మామ సునీల్ శెట్టి ఫామ్ హౌజ్ ముస్తాబైంది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. వివిధ రంగాల ప్రముఖులు ఈ వివాహ వేడుకకు తరలిరానున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతి...
గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించడంతోనే కేంద్ర ప్రభుత్వం తన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మల్లికా సారాభాయ్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో రామప్ప ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లిక నా...
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం రాకపోవడానికి నిర్వహణ లోపమే కారణం. వైద్య సేవలు మెరుగ్గా ఉన్నా నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రులకు శాపంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో మానవుడి మృతదేహం కళ్లు ఎలుకలు తినేశాయి. ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పినా.. తమను పట్టించుకోకపోవడం లేదని రోగులు, ...
మహిళలపై నేరాలను అరికట్టడంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అబలలకు అండగా కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు ఉండడంతో కొద్దోగొప్పో మహిళలపై అఘాయిత్యాలు అదుపులో ఉన్నాయి. తాజాగా కేరళ ఉన్నత న్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ మాదిరి నో మీన్స్ నో (వద్దంటే వద్దు) అని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మహిళ లేదా బాలిక వద్దంటే వద్దు అనే అర్థమని, దీన్ని పుర...
భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులకు బోర్డు శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హిందీ, ఆంగ్లంతో పాటు మరో 13 భారతీయ భాషల్లో ఎస్ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలుగు భాషలోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షలు జరగనున్నాయి. పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాల...
సోషల్ మీడియాను యువత దుర్వినియోగ పరుస్తోంది. అవసరాలకు వాడుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. దీని పర్యావసనాలు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయితో చేసిన వీడియో కాలింగ్ ద్వారా సినిమా రేంజ్ లో కట్టు కథ అల్లాడు. చివరికి కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ ఘటనలో ...