• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

ఉమేశ్ యాదవ్‌కి కుచ్చుటోపి పెట్టిన స్నేహితుడు..  రూ. 44 లక్షలు తీసుకొని..

టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...

January 21, 2023 / 06:04 PM IST

కేటీఆర్ దావోస్ టూర్ సక్సెస్.. రాష్ట్రానికి రూ. 21వేల కోట్ల పెట్టుబ‌డులు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. 4 రోజుల్లో 52 వాణిజ్య‌ సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దావోస్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు రూ...

January 21, 2023 / 05:44 PM IST

నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్దరాత్రి ప్రారంభం కానుంది. ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అ...

January 21, 2023 / 05:32 PM IST

వామ్మో.. బుల్లెట్ పై బీర్ తాగినందుకు రూ.31 వేల జరిమానా

యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలని.. తమకు ఫాలోవర్లు పెరగాలని కొందరు చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. అలాగే ఓ యువకుడు ఓ విన్యాసం చేయగా ఫాలోవర్లు కాదు పోలీసులు వచ్చారు. రూ.31 వేల జరిమానా వేశారు. దీంతో ఆ యువకుడు లబోదిబోమని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ యువకుడు జైల్లో బందీగా ఉన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో చో...

January 21, 2023 / 05:29 PM IST

యువకుడిని కారుతో ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లిన మహిళ!

  ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు దిగి మహిళను నిలదీసేందుకు బాధితుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక.. అతడ్ని కారుతో ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. కారు బ్య...

January 21, 2023 / 04:16 PM IST

బైక్ మీద పొయ్యి పెట్టి చలి కాచుకున్న కొంటె కుర్రాళ్లు

దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చాలా మంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలికి బలవ్వాల్సిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఇద్దరు యవకులకు ఓ ఐడియా తట్టింది. బైక్‌పై వెళ్లే సమయంలో కూడా చలి నుంచి రక్షణ కోసం వినూత్న ఆలోచన చేశారు. బైక్‌ వెనుకవైపు చిన్న కుంపటి అమర్చి ...

January 21, 2023 / 04:08 PM IST

తెలంగాణలో పర్యటించనున్న మోడీ.. వివరాలివే

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే వచ్చే నెలలో రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 13న ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివ...

January 21, 2023 / 02:24 PM IST

రాజమౌళికి అవతార్ డైరెక్టర్ ఆఫర్!

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో దర్శక ధీరుడి పేరు మార్మోగిపోతోంది. ఇటీవలె గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తే మాత్రం.. చరిత్ర సృష్టించినట్టే. ప్రతి ఒక్క తెలుగుడికే కాదు యావత్ దేశానికే గర్వకారణం. అందుకే రాజమౌళికి మేకింగ్‌కు ఫిదా అయిపోయాడు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. హాలీవుడ్‌లో స...

January 21, 2023 / 02:06 PM IST

‘కాంతారా2’ షూటింగ్ త్వరలో.. రిలీజ్ ఎప్పుడంటే!?

కన్నడలో మొదలైన కాంతార క్రేజ్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. కెజియఫ్ తర్వాత కన్నడ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 450 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన హోంబలే ఫిల్మ్స్‌కు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో లెక్కలు వేసుకోండి. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌ను ఓ ట...

January 21, 2023 / 01:42 PM IST

రాముడు వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద కామెంట్స్

రాముడిని మన దేశం దేవుడుగా కొలుస్తుంది. అలాంటి రాముడిపై హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో… ఆయనపై రాముడి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాముడు ప్రతిరోజూ తన భార్య సీతతో కలిసి మధ్యాహ్నం వైన్ తాగేవాడు అంటూ హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్...

January 21, 2023 / 01:23 PM IST

తిరుమల డ్రోన్ వీడియోపై వైవీ స్పందన

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన అంశం పైన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల డ్రోన్ వీడియో వైరల్ గా మారింది. అత్యంత భద్రత ఉండే తిరుమలపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీటీడీ బోర్డుపై విమర్శలు వచ్చాయి. దీంతో సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. స...

January 21, 2023 / 12:25 PM IST

viral video: రోడ్ సైడ్ నూడుల్స్ తయారీ ఇలా ఉంటుందా?

మీకు నూడుల్స్ ఇష్టమా? అదీ వీధి బండ్లలోపై దొరికే ఫుడ్ ఇష్టంగా తింటారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. నూడుల్స్ ఎలా తయారు చేస్తారనే వీడియోనే పీఎఫ్‌సీ క్లబ్ ఫౌండర్ చిరాగ్ భట్టాచార్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. 59 సెకన్ల నిడివి గల వీడియోలో నూడుల్స్ తయారీని చూపించారు. పరిశుభ్రతను మాత్రం మరిచారు. ఓ సారి వీడియో చూస్తే.. మరోసారి స్ట్రీట్ సైడ్ నూడుల్స్ తినే ధైర్యం చేయరు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల...

January 21, 2023 / 01:15 PM IST

రాహుల్ గాంధీని శంకరాచార్యతో పోల్చిన ఫరూఖ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని గుర్తు చేశారు. ఆ తత్వవేత్త మాదిరి ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. 19న జమ్మూ కాశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్‌ను ఏ...

January 21, 2023 / 02:15 PM IST

వందేభారత్ రైలుపై మరోసారి దాడి.. ఈసారి ఎక్కడంటే?

వందేభారత్ రైళ్లపై దాడులు కలకలం రేపుతోన్నాయి. పశ్చిమ బెంగాల్, విశాఖపట్టణంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్‌లో గల కతిహార్ జిల్లాలో ఈరోజు దాడి జరిగింది. 22302 నంబర్ రైలుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. సీ6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య గ...

January 21, 2023 / 10:16 AM IST

గాంధీ భవన్ లో కలుసుకున్న ఆ ఇద్దరు.. చెవిలో గుసగుసలు.. మర్మమేంటో?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లోకి అడుగు  పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...

January 20, 2023 / 07:44 PM IST