ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన అంశం పైన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల డ్రోన్ వీడియో వైరల్ గా మారింది. అత్యంత భద్రత ఉండే తిరుమలపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీటీడీ బోర్డుపై విమర్శలు వచ్చాయి. దీంతో సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వీడియోను పెట్టిన వ్యక్తిని గుర్తించామన్నారు. ఈ డ్రోన్ వీడియోకు సంబంధించి వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. కాగా హైదరాబాద్ నుండి వచ్చిన యువకులు వీడియో తీసినట్లు తెలుస్తోంది.