దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చాలా మంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలికి బలవ్వాల్సిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇద్దరు యవకులకు ఓ ఐడియా తట్టింది. బైక్పై వెళ్లే సమయంలో కూడా చలి నుంచి రక్షణ కోసం వినూత్న ఆలోచన చేశారు. బైక్ వెనుకవైపు చిన్న కుంపటి అమర్చి అందులో మంటపెట్టి చలి కాచుకుంటూ రోడ్డుపై చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.