రాముడిని మన దేశం దేవుడుగా కొలుస్తుంది. అలాంటి రాముడిపై హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో… ఆయనపై రాముడి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడు ప్రతిరోజూ తన భార్య సీతతో కలిసి మధ్యాహ్నం వైన్ తాగేవాడు అంటూ హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.
సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపంమని, ఇది తాను చెప్పడం లేదని, ఆ పత్రాలు చెబుతున్నాయని అన్నారు. జనవరి 20వ తేదీన కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా… ఇలాంటి వ్యాఖ్యలు ఆయన గతంలోనూ చేయడం గమనార్హం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు మత్తు పదార్థాలు తాగేవాడని, సీతను కూడా తాగేలా చేశాడని పేర్కొంటూ అప్పట్లో పెద్ద వివాదానికి తెరలేపారు.