టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను పట్టించుకోవడం మానేశాడు.
ఆస్తి కొనుగోలు పేరుతో ఉమేశ్ యాదవ్ కి చెందిన రూ.44 లక్షల మేర మోసగించాడు. విషయం తెలిసిన యాదవ్ తన సొమ్మును తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. శైలేశ్ ఆ సొమ్మును తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు ఉమేశ్ డబ్బులతో కొన్న ఆస్తిని సైతం ఉమేశ్ పేరున రాయడానికి కానీ అంగీకరించలేదు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.