»What Will Shah Rukhkhans Daughter Do If Her Boyfriend Cheats On Her Suhana Khans Answer Will Surprise You
Suhana Khan: బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే..షారుఖ్ డాటర్ అంత పని చేస్తుందా?
షారుఖ్ ఖాన్ కుతురు సుహానా ఖాన్ సోషల్ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తనను చీట్ చేస్తే ఏం చేస్తుందో చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
What will Shah RukhKhan’s daughter do if her boyfriend cheats on her, Suhana Khan’s answer will surprise you
Suhana Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(ShahRukh Khan) పేరు తెలియని ఇండియా సినీ ప్రేమికులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పఠాన్(Pathan) సినిమాతో మళ్లీ రేసులోకి వచ్చిన ఈ స్టార్ ప్రస్తుతం జవాన్ చిత్రంతో మనముందుకు రాబోతున్నారు. తాజాగా ఆయన కూతురు సుహానా ఖాన్(Suhana Khan ) బాలీవుడ్(Bollywood)లో తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన ది ఆర్చీస్(The Archies) చిత్రం డిసెంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లను షూరు చేశారు. అందులో భాగంగా సుహానా ఖాన్ పలు ఇంటర్వ్యూలతో బిజీగా మారింది.
తాజాగా వోగ్(Vog) ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసి, ఇతర అమ్మాయిలతో కానీ మీ ఫ్రెండ్స్‌తో కానీ డేటింగ్ చేసిన విషయం మీకు తెలిస్తే ఏం చేస్తారని ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె సింపుల్‌గా అతన్ని వదిలేస్తానని చెప్పింది. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని స్పష్టం చేసింది. కేవలం ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తినే తాను ఇష్టపడుతానని వెల్లడించింది. తాను స్టార్ కిడ్‌గానే కాకుండా స్వతహాగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇక తాను నటించిన ది ఆర్చీస్(The Archies) సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో సుహానాతో పాటు ఖుషి కపూర్, అగస్త్య నంద, మిహిర్ అహూజా, సింగర్ ఆదితి సైగల్, వేదాంగ్ రైనా తదితరులు నటించారు.