»Pushpa 2 Trailer Allu Arjun New Look Crazy Update
Pushpa2TheRule: రిలీజ్ డేట్ ఫిక్స్..న్యూ లుక్ కేక
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్(allu arjun) పుష్ప మూవీ పార్ట్ 2(pushpa 2 the rule) నుంచి సరికొత్త అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గురించి అల్లు అర్జున్ స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్( allu arjun) యాక్ట్ చేసిన పుష్ప: ది రూల్(pushpa 2 the rule) – పార్ట్ 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన డైలీ షూటింగ్ గురించి కొత్త లుక్లో ఉన్న ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పలు అంశాలను స్టైలిష్ స్టార్ పంచుకున్నారు. ప్రస్తుతం పుష్ప మూవీ పార్ట్ 2 రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. కొత్త లుక్లో అల్లు అర్జున్ ఓ లారీపక్కన నిల్చున్న ఫోజులో కనిపిస్తున్నారు. అంతేకాదు పుష్ప పార్ట్ 1 కంటే ఇది కొంచె డెవలప్ అయిన లుక్ మాదిరిగా అనిపిస్తుంది. చేతులకు బంగారం బ్రాస్ లైట్స్, మెడలో గోల్డ్ చైన్, చేవులకు పొగులు వంటివి ఉన్నాయి. దీంతోపాటు హెయిర్ స్టైల్లో కూడా కొంచెం మార్పులు చేశారు.
ఈ మాస్ లుక్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్, కేక అంటూ నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే 10 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. ఈ స్నీక్ పీక్ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో ఇప్పటికే ఫుష్ప పార్ట్ 1 భారీ విజయం నమోదు చేసుకున్న నేపథ్యంలో పార్ట్ 2పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని మార్చి 22, 2024న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.