Bollywood: మరో పెళ్లైన బ్యూటీతో హీరో ఎఫైర్.. బాలీవుడ్ హాట్ జోడీ విడిపోయిందా?
సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ అనేవి కామన్. ముఖ్యంగా బాలీవుడ్లో హీరోలు హీరోయిన్స్ ప్రేమలో పడటం.. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ అవ్వడం జరుగుతునే ఉంటుంది. తాజాగా ఓ ముదురు జంట విడిపోయినట్టుగా తెలుస్తోంది. 4 ఏళ్లు రిలేషన్లో ఉన్న ఈ జోడీ బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ బ్యూటీ మలైకా అరోరా సుమారు నాలుగేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ళు గ్యాప్ ఉన్న 2019 నుంచి డేటింగ్ చేస్తునే ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి పై ఎన్నో విమర్శలు వచ్చాయి. స్టార్టింగ్‌లో కొడుకు వయసు ఉన్న హీరోతో ప్రేమాయణం ఏంటని మలైకా ఏకి పారేశారు నెటిజన్స్. అయితే ఇవేవి ఈ యంగ్ అండ్ ముదురు జోడీ పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకుంటు పోయారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా పబ్లిక్ గానే రెచ్చిపోయింది ఈ జంట. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.
అలాంటి వార్తలకు ఈ జంట చెక్ పెడుతున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. తాజాగా టీ షర్ట్ పై ఓ కోట్తో బ్రేకప్ పై హింట్ ఇచ్చింది మలైకా. ముంబైలోని ఓ ఐ క్లినిక్‌ని సందర్శించిన మలైకా అరోరా.. ఈ క్రమంలో ఓ గ్రే కలర్ స్వేట్ షర్ట్‌ని ధరించింది. దానిపై ‘Lets Fall Apart’ అని రాసి ఉంది . అంటే తెలుగులో ‘విడిపోదాం’ అని అర్థం. ఇక మలైకా టీ షర్ట్ పై ‘విడిపోదాం’ అని ఉండడంతో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ పై ఇలా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిదనే న్యూస్ వైరల్‌గా మారింది. దానికి తోడు అర్జున్ కపూర్ మరో బ్యూటీతో లవ్‌లో పడ్డాడనే న్యూస్ మరింత బలమిస్తోంది.
అర్జున్ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషా కపిలతో రిలేషన్లో ఉన్నాడట. రీసెంట్‌గానే కుషా కపిల తన భర్త జోరవర్ అహ్లువాలియా నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. అర్జున్ కపూర్ వల్లే అమ్మడు ఇలా చేసిందనే టాక్ నడుస్తోంది. అందుకే.. మలైకా ఇలా బ్రేకప్ పై హింట్ ఇచ్చిందనే అంటున్నారు. అంతేకాదు.. అర్జున్‌ని ఏం చేయలేక కుషా పై మండిపడుతోందట మలైకా. ఏదేమైనా ఈ యంగ్ అండ్ ముదురు జోడీ మాత్రం ఎప్పటికీ హాట్ టాపికేనని చెప్పొచ్చు.