»Kd Arrested For Cheating 25 Women Through Matrimony Sites
Matrimonial Fraud: మ్యాట్రీమోని సైట్ల ద్వారా 25 మంది మహిళలను మోసం చేసి కేడీ అరెస్ట్
ఆన్లైన్ పెళ్లి సంబంధాల సైట్ల ద్వారా 25 మందికి పైగా మహిళలను మోసం చేసిన నయా కేడీ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో అతను చేసిన మోసాలకు అధికారులే విస్తుపోయారు.
Matrimonial Fraud: ఆన్లైన్ పెళ్లి సైట్ల ద్వారా 25 మందికిపైగా మహిళలను మోసగించి అరస్ట్ అయిన వ్యక్తి లీలలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. అతని పేరు ఇమ్రాన్ అలీఖాన్ వయస్సు 42 ఏళ్లు. హైదరాబాద్‌కు చెందిన ఈయన దేశవ్యాప్తంగా తన పనితనాన్ని చూపించాడు. వయస్సు ఎక్కువగా ఉండి పెళ్లి కాని మహిళలే ఈయన టార్గెట్. అలా మొత్తం ఏడుగురిని పెళ్లి చేసుకొని, మరో ముగ్గిరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ కేటుగాడు ముంబై నగరంలోని పైదోనీ ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల టీచర్‌తో ఆన్ లైన్ యాప్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు.
తనను పెళ్లి చేసుకుంటాను నమ్మించి రూ. 22 లక్షలు తీసుకొన్నాడు. పెళ్లి తరువాత వాళ్లు ఉండేందుకు ఇళ్లు కట్టాలి అని నమ్మించాడు. ఇక కాలం గడుస్తున్నా ఇల్లు లేదు కొన్నాళ్లకు ఇమ్రాన్ సైతం కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో బయట పడ్డ నిజాలకు పోలీసులే షాక్ అయ్యారు. సోలాపూర్, పర్బానీ, పశ్చిమ బెంగాల్, ముస్సూరి, లక్నో, ఢిల్లీకి చెందిన మహిళలను తాను పెళ్లి చేసుకున్నాడు. సైట్ల ద్వారా తాను బిజెనెస్మ్యాన్ అని నమ్మించి హోటల్లకు రప్పించి బుట్టలో వేసుకునేవాడు. నమ్మిన మహిళలు డబ్బులు ఇవ్వడం, మోసపోవడం ఇదే పరిపాటి. ఇలా తన పథకాన్ని అమలు చేసేవాడు.