బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడం పట్ల కావాలనే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The case against Boath MLA Rathod Bapurao house sale cheating
బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు(Rathod Bapurao)కు షాక్ తగిలింది. తాజాగా ఈ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదైంది. 2012లో అమ్మిన రెండు ఇళ్ల స్థలాలను మరోసారి అమ్మారని ఆదిలాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకెళ్లారు. ఆ క్రమంలో బాపూరావు తానను మోసం చేశారని పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశాలతో బాపూరావు, సుదర్శన్ లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటివల అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బోథ్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకు కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాథోడ్ బాపురావు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నిన్న కలిశారు. తనను కలిసిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా గుర్తురాని కేసు ఇప్పుడే అధికార పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు పలువురి ద్వారా కావాలనే తనపై ఈ కేసు పెట్టించారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆరోపిస్తున్నారు. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున ఈసారి బోథ్ ఎమ్మెల్యే(Boath MLA) బరిలో అనిల్ జాదవ్ ఉన్నారు.