తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే వచ్చే నెలలో రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 13న ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. పెరేడ్ గ్రౌండ్స్ లో పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ఈ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతల్లో మరింత ఊపు తెచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు ఎత్తుగడ వేస్తున్నారు.