భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది.
సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని నాసా తెలిపింది. సూర్యుడిలో ఇతర భాగాలకంటే కూడా చల్లగా ఉన్న భాగాలు నల్లగా మచ్చల రూపంలో కనిపిస్తాయని నాసా వెల్లడించింది.