»2023 Likely Hottest In 100000 Years European Union Scientist
Temparature : షాకింగ్ న్యూస్.. లక్ష ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023
వాతావరణం చాలా మారిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, సముద్ర మట్టాలు పెరగడం, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు లవణీయత పెరగడం వంటి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Temparature : వాతావరణం చాలా మారిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, సముద్ర మట్టాలు పెరగడం, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు లవణీయత పెరగడం వంటి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2023 చాలా వేడి సంవత్సరం. ఇలాంటి ఉష్ణోగ్రతలు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు కాదు గత సంవత్సరం మిలియన్ సంవత్సరాలలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది.
సహజంగా సంభవించే ఎల్ నినో, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తుఫానులు, కరువులు, అడవి మంటలు గత సంవత్సరం గ్రహాన్ని తాకాయి. ఇది 2023 ఫిబ్రవరి నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలనే పారిస్ ఒప్పందం లక్ష్యానికి తూట్లు పొడిచేదిగా ఉంది. ప్రతి యేడాది 1.5 సెల్సియస్ డిగ్రీల భూతాపం పెరుగుతుంది. నిజానికి ఈ సంఖ్య మనకు చిన్నదిగా కనిపిస్తున్నా..సైంటిఫిక్ గా ఈ సంఖ్య చాలా పెద్ద సంఖ్య . సహజంగా అయితే 20 సంవత్సరాలకు కాని పెరగదు. అమెజాన్ బేసిన్లో వినాశకరమైన కరువు, దక్షిణ ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలపు ఉష్ణోగ్రతలు, దక్షిణ అమెరికాలో ఘోరమైన కార్చిచ్చు, కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతంతో సహా ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పలు విపత్తులు సంభవించాయి.2024 మరింత దారుణంగా ఉండవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం లో మార్పులు సరైన టైంకి జరగాల్సిన దానికంటే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయంటున్నారు.