»Nasa Released A Picture Of The Sun Viral On Social Media
NASA: నక్షత్రం ఏర్పడే చిత్రాన్ని విడుదల చేసిన నాసా..
విశ్వరహస్యాలను చేధించేందుకు నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక అద్భుతాన్ని చిత్రీకరించింది. సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు కూడా ఇలానే జరిగుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
NASA released a picture of the sun.. viral on social media
NASA: మనకు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసు. విశ్వం పుట్టుక, దానికి రహస్యం గురించి తెలుసుకునే ప్రయోగం. అలాగే విశ్వం గురించి తెలుసుకునేందుకు నాసా (NASA) జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James Web Telescope) ను ప్రయోగించిన విషయం కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే అనేక విశ్వ రహస్యాలను చెప్పిన ఈ టెలిస్కోప్ తాజాగా ఒక నక్షత్రం ఏర్పడుతున్నప్పటి చిత్రాన్ని ఫొటో తీసి నాసాకు పంపింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మన సూర్యుడు కూడా ఒకప్పుడు ఇలానే ఏర్పడి ఉంటాడని పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలో ఉన్న వస్తువుని హెర్బిబ్ హారో ఆబ్జెక్ట్స్ అంటారని, మనకు 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఈ ఖగోళ అద్భుతం జరుగుతోందని పేర్కొంది. దీనికి హెర్బిగ్ హారో 211 అని పేరు పెట్టింది. మనం ఒక వేళ సూర్యుడు పుడుతున్నపుడు ఫొటో తీస్తే అది ఇలానే ఉంటుంది. ఒక చిన్న ఖగోళ వస్తువు తన ధ్రువాల నుంచి వాయువులను వెదజల్లుతున్నపుడు తీసిన చిత్రం ఇది అని వెల్లడించింది. ప్రస్తుతం దీని వయసు కేవలం వేలలోనే ఉంటుంది. కాలం పెరిగేగొద్దీ ఒక సమయంలో ఇది మన సూర్యునిలా రూపు దాలుస్తుంది అని నాసా తెలిపింది. ఇలా పదులు లేదా వేల వయసున్న శిశు నక్షత్రాలను క్లాస్ 0 ప్రొటోస్టార్లని పిలుస్తారు. ఇవి కేవలం పదుల నుంచి వెయ్యేళ్ల వయసుతో మాత్రమే ఉంటాయి.
ఈ ప్రొటోస్టార్ల ద్రవ్యరాశి మన సూర్యుని ద్రవ్యరాశిలో 8 శాతం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం హెర్బిగో హారో 211 వెదజల్లుతున్న వాయువుల్లో సిలికాన్ మోనాక్సైడ్, మాలిక్యులర్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్లు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల ఇన్ఫ్రారెడ్ కాంతి పుంజాలు ఏర్పడుతున్నాయి. వాటిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గ్రహించి ఫొటోను తీసి నాసాకు పంపించింది.