గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే బిజెపి, అరవింద్ వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.