WNP: జిల్లాలోని కోర్టుల్లో డిసెంబర్ 21న జరగనున్న మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి ఎం. ఆర్. సునీత విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్ కేసులను రాజీమార్గాల ద్వారా పరిష్కరించేందుకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.