W.G: భీమవరంలో డిసెంబర్ 12,13 తేదీల్లో జరిగే బాలోత్సవాలకు సర్వం సిద్ధం అయినట్లు బాలోత్సవం అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో భీమవరం టౌన్, రూరల్, కాళ్ళ, ఆకివీడు, ఉండి, పాలకోడేరు, వీరవాసరం మండలాల నుంచి రోజుకు సుమారు 3000 మంది వరకు పార్టిసిపెంట్స్ పాల్గొంటారని, కల్చరల్, అకడమిక్, డ్రాయింగ్ అంశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.