NGKL: అచ్చంపేటలోని బాలసదన్ ఆశ్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి స్పందన రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాలికలకు అందుతున్న సౌకర్యాలు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.