VSP: జిల్లాలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు ఇవాళ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో రూ.1,583 కోట్లతో ఏర్పడే ఈ క్యాంపస్ ద్వారా 8,000 ఉద్యోగాలు లభించనున్నాయి. తాత్కాలిక క్యాంపస్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.