RR: బాధ్యతాయుతమైన పౌరులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నిన్న ఓయూలో ‘యువ ఆపద మిత్ర’ పథకం వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రంగనాథ్ హాజరై మాట్లాడారు. ఎవరికి వారు మనకెందుకు అనుకోకుండా తనవంతుగా సమాజహితం కోసం కాస్త ఆలోచించాలి. మరీ ముఖ్యంగా యువత ఈ విషయమై దృష్టి పెట్టాలి అని సూచించారు.