NTR: రెడ్డిగూడెం జడ్పీహెచ్ స్కూల్లో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గర్భస్థ ఆడ శిశువులను కాపాడి బంగారు సమాజాన్ని నిర్మించాలని ఐసీడీఎస్ అధికారి పుష్పలత పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారా లేదా ఏం పనిచేస్తున్నారనే విషయాలను చైల్డ్ కమ్యూనిటీ సభ్యులు తెలుసుకోవాలని ఆమె సూచించారు.