AKP: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎలమంచిలి మాజీ ఎంపీపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బోదెపు గోవిందు భేటీ అయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను అధినేతకు గోవిందు వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నారు.