ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్స్‌ను భారత్ లైట్ తీసుకుంది. IQAir, WHO వంటి సంస్థల ర్యాంకులు అధికారికం కాదని కేంద్రం స్పష్టం చేసింది. WHO గైడ్‌లైన్స్ కేవలం సలహాలు మాత్రమేనని, వాటిని పాటించాల్సిన నిబంధన లేదని మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. మన దేశ పరిస్థితులకు తగ్గట్టు మనకంటూ సొంత ప్రమాణాలు ఉన్నాయని, విదేశీ ర్యాంకులను పట్టించుకోవాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు.