కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 25 వరకు ‘ప్రశాసన్ గావ్ కీ వోర్’ పేరుతో ప్రజా సమస్యల పరిష్కార వారాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారు. సుపరిపాలన-2025లో భాగంగా దీనిని చేపడుతున్నట్లు సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.