ATP: ’అఖండ-2′ సినిమా విడుదల సందర్భంగా అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. టీడీపీ కార్యాలయం నుంచి గౌరీ కాంప్లెక్స్ వరకు వందలాది మంది అభిమానులు ‘జై బాలయ్య’ నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే ప్రసాద్ గౌరీ థియేటర్లో శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. ఈ సినిమా ‘అఖండ-1’కు మించి విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.