BDK: చుంచుపల్లి మండలంలో నేడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా గౌతంపూర్, రుద్రంపూర్, 4 ఇంకైన్, ప్రశాంతినగర్, రామాంజనేయకాలనీ, బాబుక్యాంపు గ్రామ పంచాయతీలలో జరగబోయే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు.