కోనసీమ: మండపేట కు చెందిన YCP జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షులు చోడే సత్యకృష్ణ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డినీ కలిశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలో జగన్ని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..పార్టీ అభివృద్ధికి సత్య కృష్ణ కుటుంబం పని చేస్తుందన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని భవిష్యత్తులో అధికారం చేపట్టబోతున్నామన్నారు.