బావ సర్టిఫికెట్లను వాడుకుని బావమరిది స్పెషలిస్టు డాక్టర్‌గా ఉద్యోగం పొందాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అమెరికాలో ప్రాక్టిస్ చేస్తున్న తన బావ డాక్టర్ రాజీవ్ కుమార్ సర్టిఫికెట్లతో బావమరిది అభినవ్ ఓ మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. అతడి అక్క డాక్టర్ సోనాలీ ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.