WNP: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారు రాజమహేందర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో కాంగ్రెస్ మద్దతుదారు సుదర్శన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రాజమహేందర్ రెడ్డి గెలుపుతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.