TG: వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. అగ్రివర్సిటీ పరిధిలో 1,800 సీట్లను భర్తీ చేశారు. మొత్తం సీట్లలో రైతు కుటుంబాల పిల్లలకు 450, రైతు కూలీల పిల్లలకు 150, NRI కోటాలో 150, ప్రత్యేక కోటాలో 400, ఐకార్ కోటాలో 120 మంది చొప్పున సీట్లు పొందినట్లు వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.