W.G: పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో నిన్న 28వ విడతలో 32 మంది లబ్ధిదారులకు రూ. 19,23,755 ల చెక్కులను అందించారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 427 మందికి రూ. 3,66,63,664 లు అందించామన్నారు.