AP: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.