MDK: హవేలి ఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ సర్పంచ్‌గా కాట్రోత్ రమేష్ గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన రమేష్ 143 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మొన్నటి వరకు రమేష్ భార్య రేణుక సర్పంచ్‌గా పనిచేశారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేస్తానన్నారు.